ఎంఐఎం చీఫ్‌ ఇంటిపై రాళ్ల దాడి.. పోలీసులకు ఫిర్యాదు

-

ఢిల్లీలో హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై కొందరు దుండగులు దాడి చేశారు. 13వ తేదీ సాయంత్రం ఢిల్లీలోని ఆయన అధికార నివాసంలో ఈ ఘటన జరిగింది. ఇంటి తలుపు అద్దాలు ధ్వంసం అయ్యాయి.. ఈ దాడుల్లో ఓవైసీకి ఎలాంటి గాయాలు కాలేదు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ, ఢిల్లీలోని అసదుద్దీన్‌ ఒవైసీ నివాసం తలుపుపై రెండు అద్దాలు పగిలి ఉన్నాయ‌ని తెలిపారు. పగిలిన అద్దాల పరిసరాల్లో ఎలాంటి రాయి లేదా మరే ఇతర వస్తువులు కనిపించలేదని సీనియర్ పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు.

ఈ దాడికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు అసదుద్దీన్. తన ఇంటిపై గతంలోను రాళ్ల దాడి జరిగిందని, పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదని చెప్పారు. ఓ వైపు బుల్డోజర్లు, మరోవైపు రాళ్ల దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఎంపీ ఇంటిపైనే రాళ్ల దాడి జరిగితే సామాన్యుడి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇదే దాడి ఓ బీజేపీ నేత ఇంటిపై జరిగితే మౌనంగా ఉండేవారా? అని ప్రశ్నించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version