మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో దారుణం చోటు చేసుకుంది. అక్కడి పోలీసు విభాగంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ (ఏడీజీ)గా పనిచేస్తున్న పురుషోత్తం శర్మ తన భార్యను ఇంట్లో కింద పడేసి ఆమె మీద కూర్చుని ఆమెను చితకబాదాడు. కాగా ఆ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే దీనిపై నేషనల్ కమిషన్ ఫర్ వుమెన్ (ఎన్‌సీడబ్ల్యూ) స్పందించింది. ఆ అధికారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సూచించింది. దీంతో శర్మను ప్రస్తుతం అక్కడి నుంచి బదిలీ చేశారు. అతనిపై అతని కుమారుడు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
Purshottam Sharma, Special DG, MP brutally assaults his wife😳
It seems domestic violence rises with education & status in India!!!pic.twitter.com/yx9US5n7dB— Seema Choudhary (@Seems3r) September 28, 2020
కాగా ఆ సంఘటనపై శర్మను మీడియా వివరణ కోరగా.. 32 ఏళ్ల నుంచి తాము కలసి జీవిస్తున్నామని, 2008లో ఆమె తనపై కంప్లెయింట్ ఇచ్చిందని అన్నాడు. అయినపప్పటికీ అప్పటి నుంచి ఆమె తన ఇంట్లోనే నివసిస్తుందని, అన్ని రకాల వసతులను పొందుతుందని, విదేశాలకు కూడా తన డబ్బుతోనే వెళ్తుందని, అలాంటప్పుడు ఆమెపై తనకు అన్ని అధికారాలు ఉంటాయని, ఆమె తన ప్రాపర్టీ అని, ఆమెను హింసించడం కరెక్టేనని అతను తనను తాను సమర్థించుకున్నాడు. కాగా ఆ వీడియోపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. వెంటనే అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అతన్ని పోలీసు ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.