కొడంగల్ లో ఉద్రిక్తత..DK అరుణను అడ్డుకున్న పోలీసులు !

-

MP DK Aruna visit to Kodangal: కొడంగల్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీజేపీ ఎంపీ డీకె అరుణను అడ్డుకున్నారు పోలీసులు. రైతులను అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో ఎంపీ డీకె అరుణ… కొడంగల్ పర్యటనకు బయలు దేరారు. ఈ తరుణంలోనే… మన్నె గూడ వద్ద ఎంపీ అరుణను అడ్డుకున్నారు పోలీసులు.

MP DK Aruna visit to Kodangal

దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన Dk. అరుణ… పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో.. అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాగా, లగచర్ల దాడి కేసులో రిమాండ్ రిపోర్ట్ బయటపెట్టారు అధికారులు. దీనిపై అధికారిక ప్రకటన చేశారు. బూంరాస్ పేట్ పిఎస్ లో FIR నమోదు చేశారు. 153/2024 క్రైం నెంబర్ కేసు పెట్టారు. సెక్షన్ 61(2) 191(4),132,109,121(1) 126(2)324 r/w190BNS Sec 30Of pdpp act, 128Of bnss కింద కేసులు నమోదు నమోదు చేశారు. హత్యాయత్నం, అసాల్టింగ్, ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం వంటి నాన్ బెయిలబుల్ కేసులు నమోదు కూడా పెట్టారు. వికారాబాద్ DSP శ్రీనివాస్ రెడ్డి పిర్యాదు తో కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version