ఫార్మా సిటీ విషయంలో వెనక్కి తగ్గేది లేదు – రేవంత్ రెడ్డి సోదరుడు

-

కొడంగల్‌ ఫార్మా సిటీ విషయంలో వెనక్కి తగ్గేది లేదని సంచలన ప్రకటన చేశారు రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కలిశారు. అనంతరం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. సీఎం పేరు ప్రతిష్టలు దెబ్బతీసేందుకే హరీష్ రావు, కేటీఆర్ లు ఇలాంటివి చేపిస్తున్నారని ఫైర్‌ అయ్యారు.

Revanth Reddy brother is Anumula Tirupati Reddy comments

అధికారులపై దాడి ఘటనలో బీఆర్ఎస్ శక్తులు పనిచేశాయని… నిందితులు ఎంతటి వారైనా సరే పోలీసులు అరెస్ట్ చేసి తీరుతారని తెలిపారు తిరుపతి రెడ్డి. హరీష్ రావు లాగా మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ కోసం రాత్రికి రాత్రే గ్రామాలను ఖాళీ చేపించి రైతులను మేము కొట్టట్లేదని పేర్కొన్నారు తిరుపతి రెడ్డి. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంటే అమాయకులను రెచ్చగొట్టారని మండిపడ్డారు తిరుపతి రెడ్డి. చట్టం తప్పకుండా తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version