తెలంగాణలో కాంగ్రెస్ రెండో సారి బడ్జెట్ ప్రవేశ పెట్టింది. బడ్జెట్ పెట్టే ముందు సిఎం, డిప్యూటీ సిఎం లు గాంధీ సూక్తిని ఫాలో అయ్యారు అని భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇక కేటీఆర్ ప్రతి చిన్నదాన్ని తప్పు పడుతున్నారు. భారత దేశం వృద్ధి రేటు కంటే తెలంగాణ ముందుంది. బిఆర్ఎస్ ఒక భ్రమలో బ్రతుకుతుంది. పరిపాలన చెయ్యాలంటే చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారు. తెలంగాణ రైజింగ్ అనే స్లోగన్ తో పనిచేస్తున్నాం. ప్రభుత్వం పై విష ప్రచారం చేస్తున్నారు.
అయితే మిగులు రాష్ట్రంలో బడ్జెట్ పెట్టింది బిఆర్ఎస్.. కానీ కాంగ్రెస్ అప్పుల రాష్ట్రంలో బడ్జెట్ పెట్టింది. బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ ఆగం అయింది. తెలంగాణలో భారత్ సమ్మిట్ ను పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ని చిన్న చూపు స్టేచర్ గురించి మాట్లాడుతున్నారు. దేశం తెలంగాణ గురించి మాట్లాడుతోంది. ఎన్నికల్లో కులగణన గురించి అందరూ చెప్తారు.. కానీ సిఎం రేవంత్ రెడ్డి కులగణన చేసి చూపించారు. దేశం మొత్తం చర్చ జరిగేలా తెలంగాణ లో పరిపాలన ఉంటుంది. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి అని కిరణ్ కుమార్ పేర్కొన్నారు.