తెలంగాణలో రాబోయేది హంగ్‌ సర్కార్.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రాబోయేది హంగ్‌ ప్రభుత్వమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి 60సీట్లు రావని జోస్యం చెప్పారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌తో కేసీఆర్‌ కలవక తప్పదని తెలిపారు. కాంగ్రెస్‌లో అందరం కష్టపడితే 40-50 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉండటం మాత్రం ఖాయమని అన్నారు.

“ఏ ఒక్కరితో కాంగ్రెస్‌కు అన్ని సీట్లు కూడా రావు. నేను గెలిపిస్తా అని అంటే మిగతా వారంతా ఇంట్లోనే కూర్చుంటారు. నేను స్టార్‌ క్యాంపెయినర్‌ను… ఒక్క జిల్లాలో ఎందుకు తిరుగుతా? నేను మార్చి మొదటి వారం నుంచి యాత్ర ప్రారంభిస్తాను. పాదయాత్ర ఒక్కటే కాదు… మోటార్‌ సైకిల్‌పై పర్యటిస్తాను. నా రూట్‌మ్యాప్‌ పార్టీకి చెప్పి అనుమతి తీసుకుంటాను.” అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version