సీఎం జగన్‌కు రఘురామకృష్ణంరాజు లేఖ.. ఇదే నా సమాధానం..!

-

ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డికి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరుపేజీల లేఖ రాశారు. ముందుగా సీ ఓటర్‌ సర్వేలో 4వ స్థానం వచ్చినందుకు జగన్‌కు అభినందనలు తెలిపారు. త్వరలో మొదటి స్థానం సాధించాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు.

అనంతరం తనపై వచ్చినవన్నీ నిరాధార ఆరోపణలేనని, అలాగే  తాను పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను అని లేఖలో ఆయన పేర్కొన్నారు. అలాగే విజయసాయిరెడ్డి పేరు మీద పంపించిన షోకాజ్ నోటీసు.. పార్టీ పేరు అంశాన్ని ప్రస్తావించారు. రిజిస్టరయిన పార్టీ కాకుండా తనకు మరో పార్టీ లెటర్‌ హెడ్‌ తో నోటీసు వచ్చిందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరును వాడుకోవద్దని ఈసీ చెప్పిందని ఆయన గుర్తుచేశారు..

తనపై కొందరు కావాలని కుట్ర చేస్తున్నారని, మీకు దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని రఘురామ కృష్ణంరాజు లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా తాను వెంకటేశ్వరస్వామికి గొప్ప భక్తుడినని చెప్పారు. స్వామివారి ఆస్తుల అమ్మకం అంశంలో భక్తుల మనోభావాలను మాత్రమే తాను వివరించి చెప్పానని తెలిపారు. కాగా జగన్ కు లేఖ పంపే ముందు రఘు రామకృష్ణంరాజు ప్రధాని నరేంద్రమోదీకి అనుకూలంగా ఒక పాటను విడుదల చేశారు. చైనాతో యుద్దం వస్తే ఖచ్చితంగా మోదీ నాయకత్వంలో విజయం సాధిస్తామన్న పాటను రఘురామకృష్ణంరాజు విడుదల చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version