కేటీఆర్ కి ఈడీ నోటీసుల పై మెదక్ ఎంపీ రఘునందన్ రావు కీలక కామెంట్స్ చేసారు. ధైర్యముంటే కేటీఆర్ జైలుకి వెళ్ళాలి.. జైలు లోపల ఎలా ఉంటుందో చూసి రావాలి అని సవాల్ విసిరారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు కేటీఆర్ ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఒక్క రూపాయి ఖర్చు చేసిన అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు ఆర్బీఐ కి చెప్పకుండా మన రాష్ట్ర సొమ్ముని దేశ ఫారెన్ కంపెనీల కోసం ఖర్చు పెట్టారు.
అందుకే కేటీఆర్ పై ఈడీ కేసు నమోదవుతుంది. అలాగే విచారణను ఆయన ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక ఈడీ, మోడీ, బోడి అని నోరు పారేసుకునేటప్పుడు నోరు, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిది. గతంలో ఎమ్మెల్సీ కవిత కూడా ఇలానే మాట్లాడింది. అయితే నన్ను అరెస్ట్ చెయ్యి అని ట్విట్టర్ లో పెట్టిన టిల్లు తన పై కేసు నమోదుకాగానే కోర్టుకి వెళ్ళాడు అని రఘునందన్ రావు పేర్కొన్నారు.