రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై పార్లమెంటులో ప్రసంగించారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. బీసీ కుల గణన గురించి గొప్ప చెప్పే రాహుల్ తెలంగాణ సీఎం పదవి బీసీ లకు ఇవ్వాలి. మిగిలిన ఆరు మంత్రి పదవులు కూడా బీసీ లకే ఇవ్వాలి. సగం జనాభా ఉన్న బీసీ లకు రెండే మంత్రి పదవులు ఇచ్చి జబ్బలు జరుపుకుంటున్నారు. క్యాబినెట్ లో మైనారిటీ ఎందుకు లేరో చెప్పాలి.
ఇక మోడీ మాటలు నిజం చేస్తాడు.. రాహుల్ మాటలు మాత్రమే చెప్తాడు. మోడీ క్యాబినెట్ లో 27 మంది ఓబీసీ, 8 మంది దళిత, 8 మంది మహిళా మంత్రులు ఐదుగురు మైనారిటీ మంత్రులు ఉన్నారు. తెలంగాణ ఏమీ రాలేదంటూ పత్రికల్లో రావడం బాధాకరం. ఒక్క RRR ప్రాజెక్టు కే ఇరవై వేల కోట్లకు పైగా ఇచ్చింది మోడీ సర్కారు. రైతులకు,ఉపాధి హామీ లాంటి పథకాలకు బడ్జెట్ పెంచిన ఘనత మోడీ సర్కారుదే. మధ్య తరగతి ప్రజల గోడు విన్నది కేవలం మోడీ మాత్రమే అని రఘునందన్ రావు పేర్కొన్నారు.