వైఎస్‌ షర్మిలపై ఎంపీ రఘురామ కీలక వ్యాఖ్యలు

-

ఎంపీ రఘురామకృష్ణ రాజు మంగళగిరిలో నారా లోకేష్‌ను ఓడించేందుకు జగన్ సర్కార్ పెద్ద ప్లాన్ వేసిందన్నారు. ప్రభుత్వం అనుకున్నది జరిగితే లోకేష్ మంగళగిరిలో ఓడిపోతారని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఓటమికి రెండు కారణాలు అవుతాయని ముందే అంచనా వేశారు. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై ఆయన స్పందించారు.

వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి వస్తే చాలా ప్రభావం ఉండవచ్చునని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ… వివిధ సర్వే ఏజెన్సీల నివేదికలను చూస్తే తమ పార్టీకి కష్టాలు తప్పేలాలేవని, లోక్ సభ ఎన్నికల్లో వైసీపీకి నాలుగు లేదా ఐదు స్థానాలు కూడా వచ్చే అవకాశం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్ మదిలో ఏమున్నది? అని మీడియా ప్రశ్నించగా ఆయన సమాధానం చెప్పారు. 2009లో కాంగ్రెస్ విజయం సాధించిందని, ఆ తర్వాత ఏపీలో కాంగ్రెస్ కాస్త వైసీపీగా రూపాంతరం చెందిందన్నారు. గతంలో కాంగ్రెస్ సంప్రదాయ ఓటర్లు 2014లో, 2019లో వైసీపీకి వేశారన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. ఆరుశాతం వరకు ఓట్లు వైసీపీకి నష్టం చేయనున్నట్లు తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version