ప్రముఖ నటి మన అందరికీ సుపరిచితురాలు ఎంపీ సుమలత, తెలుగు సినిమాలలో నటించడమే కాకుండా సంసారం ఒక చదరంగం ప్రోగ్రామ్ లో న్యాయ నిర్ణేతగా వ్యవహరించి మన అందరి ప్రేమ గౌరవాలను సంపాదించుకున్నారు. సాక్షాత్తు కర్ణాటక మాజీ సీఎం కొడుకు పై పోటీ చేసి మాండ్యా నియోజకవర్గంలో ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం ఆమె కరోనా బారిన పడి తన ఇంట్లో ఇసోలేషన్ లో ఉంటూ వైద్యుల ద్వారా చికిత్స పొందుతుంది.

వివరాల్లోకి వెళితే.. పేద ధనిక అనే తేడా లేకుండా అందరినీ ఒకేలా చూస్తుంది కరోనా మహమ్మారి. ఈ మహమ్మారి కారణంగా ప్రజలు ఎంతగానో సమస్యలు అనుభవిస్తున్నారు. ఇక వారికి సమస్య పై మరింత అవగాహన కల్పించి ప్రభుత్వం తరఫున సహాయం చేయడానికి బయలుదేరింది ఎంపీ సుమలత.. తన నియోజకవర్గంలో ఇటువంటి కష్టకాలంలో రెండు రోజులు పర్యటించింది. పర్యటన ముగిసిన రెండు రోజులతరువాత ఆమెకు తల నొప్పి జ్వరం రావడంతో డాక్టర్లను సంప్రదించి కరోనా టెస్ట్ చేయించుకుంది దీంతో ఆమెకు పాజిటివ్ అని తేలింది. డాక్టర్ల సహాయం తీసుకొని తన ఇంట్లోనే చికిత్స పొందుతుంది. కరోనాను త్వరలో జయించి మరలా ప్రజలకోసం వస్తానని ఆమె హామీ ఇచ్చింది.