ప్రస్తుత రోజుల్లో మనతో కలిసి మెలిసి తిరిగి తిరుగుతున్న వారిలో ఎవరికి ఎవరికి కరోనా ఉందొ, ఎవరికీ లేదో చెప్పలేని పరిస్థితి. ఇకపోతే తాజాగా ఓ అత్యాచారం కేసు నిందితుడిని అరెస్టు చేయడంతో ఏకంగా 60 మంది పోలీసులు క్వారంటైన్ కు వెళ్లాల్సి వచ్చింది. ఈ సంఘటన చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బిలాస్‌పూర్ లో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మహిళపై లైంగిక దాడి చేయడంతో ఫిర్యాదు అందుకున్న పోలీసులు అతన్ని పట్టుకునేందుకు నలుగురు పోలీసులు మైసూరు కు వెళ్లి, అక్కడ అతన్ని అరెస్టు చేసి తీసుకు వచ్చారు. ఆ తర్వాత ఆయనని రిమాండ్ కు తరలించారు.
నిజానికి అసలు కథ ఇప్పుడే మొదలైంది. సదరు వ్యక్తిని రిమాండ్ కు తరలించే సమయంలో అతనికి జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని జైలు అధికారులు తెలుసుగా… మైసూర్ నుంచి తీసుకువచ్చిన పోలీసులకు వారు తెలియజేశారు. దీంతో ఆ నలుగురు తోపాటు వారితో కలిసి పనిచేస్తున్న 60 మంది పోలీసులకు హోమ్ క్వారంటైన్ కు వెళ్లాలని జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. దీనితోపాటు వారు పనిచేసే పోలీస్ స్టేషన్ కు సీల్ వేశారు కూడా.