బాబుకు మైండ్ పోయింది గొలుసులు సిద్ధం చేయండి…! సాయి రెడ్డి వ్యాఖ్యలు..!

-

సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. తమ ప్రభుత్వం చేసే కార్యాలను అమలు చేసే పథకాలను జనంతో పంచుకుంటూ ఉంటాడు.. అలాగే ప్రతిపక్షాలకు తమ ప్రభుత్వ వ్యతిరేకులకు ఎప్పుడు కౌంటర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. ప్రతిపక్ష నేత చంద్రబాబు పై సెటైర్లు వేయడం ఈయనకు అలవాటు. ఇక తాజా ఇదే నేపద్యంలో బాబు పై ఘాటు విమర్శలు చేశాడు. బాబు మైండ్ డీజెనరేట్ అయ్యిందని గొలుసులు సిద్ధం చేయాలని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

ఆయన తన ట్వీట్టర్ ఖాతాలో మాట్లాడుతూ… ఆశ్చర్యం లేదు ఊహించిందే జరిగింది. ప్రపంచంలో ఎక్కడ కరోనా వ్యాక్సిన్ తయారైనా చంద్రబాబు తన ఖాతాలోనే వేసుకుంటాడని ముందుగానే ఊహించానని ఆయన అన్నాడు. ప్రపంచ మాయా నగరం అమరావతి పూర్తయ్యింది అని బాబుయి గతంలో చెప్పిన కట్టు కథల లాగే ఇప్పుడు కూడా తన మాయా నగరంలోని బయోటిక్ పార్క్ లో వ్యాక్సిన్ తయారయ్యిందని అవాస్తవాలు చెబుతున్నాడు అని ఆయన అన్నాడు ఇందుకు ప్రజలు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని చెప్పుకుంటున్నారు బాబుకు ఖచ్చితంగా మైండ్ డీజెనరేట్ అయ్యిందని త్వరగా గొలుసులు సిద్ధం చీయాలని ఆయన వ్యంగ్య విమర్శలు చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version