ఏపీ గవర్నర్‌తో ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ..!

-

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. ఈరోజు మధ్యాహ్నం రాజ్ భవన్‌కు వెళ్లిన ఆయన గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై గవర్నర్‌తో మాట్లాడినట్టు తెలుస్తోంది. విజయసాయిరెడ్డితో పాటు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ రాజేంద్రనాథ్ రెడ్డి కూడా రాజ్ భవన్‌కు వెళ్లినట్టు సమాచారం.

ఈ విషయాన్ని రాజ్ భవన్ వర్గాలు ట్విట్టర్ ద్వారా వెల్లడించాయి. అలాగే గవర్నర్‌తో సమావేశమైనట్టు విజయసాయిరెడ్డి కూడా ట్వీట్ చేశారు. అయితే దీనిపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య స్పందించారు. పలుకేసుల్లో ముద్దాయిగా ఉ్న ఏ-2 విజయసాయిరెడ్డితో కలిసి రాజేంద్రనాథ్ రెడ్డి గవర్నర్ వద్దకు వెళ్లడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అలాగే ఈ భేటీపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version