తెలంగాణలో ప్రతి ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా చీరల పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా గత రెండు రోజుల నుండి బతుకమ్మ చీరలు అన్ని గ్రామాలలో పట్టణాలలో పంపిణీ చేస్తున్నారు. అయితే తాజాగా వనపర్తి జిల్లా కొత్తపేట మండలం సంకిరెడ్డిపల్లి లో బతుకమ్మ చీరల పంపిణీలో గందరగోళం నెలకొంది. ఎంపీపీ మౌనిక బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తుండగా గ్రామంలోని మహిళలంతా హాజరయ్యారు. అయితే అక్కడ కూర్చున్న మహిళలు చీరలు నాణ్యత లేవని మాట్లాడుకుంటుండగా ఎంపీపీ మౌనిక చెవిన పడింది. దాంతో కోపంగా ఎంపిపి మౌనిక ‘బలవంతం ఏమీ లేదని ఇష్టం లేకుంటే చీరలు తీసుకోకుండా వెళ్లిపోవచ్చని అన్నారు. దాంతో మహిళలు తమకు ఆ చీరలు అవసరం లేదని వద్దు పో అంటూ అక్కడి నుండి లేచి వెళ్లిపోయారు.
ఇష్టం లేకుంటే చీరలు తీసుకోకండి..మాకొద్దు పో..!
-