అక్కడ జాతీయజెండా ఎగరవేయనున్న ధోని?

-

జమ్ముకశ్మీర్ ఇప్పుడు రెండు ముక్కలు. రెండోభాగంగా విడిపోయి కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన లద్దాక్ దేశంలో కీలక ప్రాంతం. మొట్టమొదటిసారి ఇక్కడ జాతీయదినోత్సవ వేడుకలను జరపడానికి కేంద్రం సన్నాహకాలు చేస్తుంది. అయితే ఇక్కడ జాతీయజెండాను ఎవరు ఎగరవేస్తారో తెలుసుకుందాం…

MS Dhoni Likely To Unfurl National Flag In Leh On Independence Day
MS Dhoni Likely To Unfurl National Flag In Leh On Independence Day

భారత క్రికెట్ మాజీ కెప్టెన్, గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా కలిగిన మహేంద్రసింగ్ ధోనీ ఈ స్వాతంత్య్ర దినోత్సవం నాడు లద్దాక్‌లోని లేహ్‌లో భారత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో ధోనీ అక్కడ జాతీయ జెండాను ఎగరవేయనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం పుల్వామా జిల్లా క్రూ ప్రాంతంలో పారా రెజిమెంట్ యూనిట్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ధోనీ భారత ఆర్మీకి ధోనీ బ్రాండ్ అంబాసిడర్.

ప్రస్తుతం అతడు విధులు నిర్వర్తిస్తున్న చోట తన బృంద సభ్యులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. వారితో కలిసి ఫుట్‌బాల్, వాలీబాల్ ఆడుతున్నాడు. అలాగే సైనిక బలగాలతో కలిసి ఆర్మీ విధుల్లో పాల్గొంటున్నాడు. అయితే ధోని ఈ నెల 10న తన బృందంతో కలిసి లేహ్ వెళ్లనున్నాడని ఓ సైనికాధికారి వెల్లడించారు. ఆగస్టు 15 వరకు ధోనీ తన విధుల్లో కొనసాగుతాడు అని అధికారి పేర్కొన్నారు. కాగా స్వాతంత్య్ర దినోత్సవం నాడు జమ్ముకశ్మీర్‌లోని ప్రతి గ్రామంలో భారత త్రివర్ణ పతాకం ఎగురవేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ధోనీ లెహ్‌లో జెండాను ఆవిష్కరించనున్నాడని తెలుస్తోంది.

-కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version