RC16 లో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ…

-

డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా RC 16 టైటిల్తో ఓ చిత్రం వస్తుంది. ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది.RC 16 మూవీకి ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్,సంగీతాన్ని అందించబోతున్నాడు. ఇంకా ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతుందని మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుందా అని మెగాభిమానులు ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సినిమాలో మరొక హీరోయిన్ కి కూడా అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఆ పాత్ర కోసం శ్రీలీలా ను తీసుకోవాలనే ఉద్దేశ్యం లో బుచ్చిబాబు సనా ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే శ్రీలీలా కి కథను కూడా వినిపించినట్టుగా టాక్.ఈ చిత్రాన్ని సుకుమార్‌-మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం గేమ్ చేంజర్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది.ఇప్పటికే 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం కోసం మెగా అభిమానులు చాలాకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news