మోదీ ఇస్తున్న రూ.10 లక్షల కోసం ఇలా అప్లై చేసుకోండి..!

-

మోదీ సర్కారు ముద్ర లోన్ పధకాన్ని తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పధకం వలన యువత, మహిళలు, వ్యాపారులు బెనిఫిట్స్ ని పొందొచ్చు. ముద్ర లోన్ ద్వారా మీ వ్యాపారం కోసం ఏకంగా రూ .10 లక్షల వరకు రుణం పొందే అవకాశం వుంది. చిరు వ్యాపారుల నుంచి ఎంఎస్ఎంఈ ఉత్పత్తి దారుల వరకూ 50 వేల నుంచి రూ. 10 లక్షల వరకు రుణం పొందొచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే…

ప్రతీ జాతీయ బ్యాంకులోనూ ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం ద్వారా లోన్ తీసుకొచ్చు. దీని ద్వారా వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడంతో పాటు దానినే ఒక ఉపాధి మార్గంగా నిలుస్తోంది. అయితే దీని వలన చాలా లాభాలు వున్నాయి. చిరు వ్యాపారులు రూ. 10 లక్షల వరకు రుణం తీసుకుని తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడంతో పాటు దానినే ఒక ఉపాధి మార్గంగాను మార్చుకునే అవకాశం వుంది. అయితే ముద్ర రుణాలు మూడు రకాలుగా ఉంటాయి. అవే శిశు, కిషోర్, తరుణ్ లోన్.

శిశు లోన్‌లో రూ .50 వేల వరకు లోన్ లభిస్తుంది. కాగా, కిషోర్ రుణంలో రూ .50 వేల నుంచి 5 లక్షల వరకు, ఇక తరుణ్ లోన్ అయితే రూ .5 నుంచి 10 లక్షల వరకు రుణాలు ఉన్నాయి.www.mudra.org.in లో పూర్తి వివరాలు చూడవచ్చు.

ఒకవేళ మీరు లోన్ తీసుకోవాలని అనుకుంటే.. అర్హులో కాదో అన్న అనుమానం ఉంటే https://merisarkarmeredwar.in/ లో చూసుకోవచ్చు. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, డిసిబి బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, సింధు ఇంద్ బ్యాంక్, జమ్మూ & కాశ్మీర్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్, కోటక్ మహీంద్రా, నైనిటాల్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, ఐడిఎఫ్‌సీ బ్యాంక్ లలో లోన్ పొందొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version