ముంబైలో కరోనా డేంజర్ బెల్స్..ఒక్కరోజే 8వేల కేసులు…!

-

ముంబై లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ లో దేశంలో ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతం ముంబై కాగా మరణాల సంఖ్య కూడా ఇక్కడే ఎక్కువ నమోదు అయ్యింది. ఇక ఇప్పుడు మరోసారి ముంబై లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ముంబై లో ఒక్కరోజే ఏకంగా 8వేల 36 కేసులు నమోదు అయ్యాయి. గత రోజులలో పోలిస్తే ఇది 2వేలకు ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తోంది.

ఇక మహారాష్ట్ర లో మొత్తం 11,877 కొత్త కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఒక్కరోజే 9మంది కన్ను మూశారు. మరోవైపు ఢిల్లీ లో కూడా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ రాష్ట్రం లో కఠిన ఆంక్షలు విధిస్తోంది. ఢిల్లీ లో కొత్తగా 3,194 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అంతే కాకుండా 1156 మంది వైరస్ బారి నుండి కోలుకున్నారు. దేశ రాజధాని లో ప్రస్తుతం 8,397 కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. మరోవైపు బెంగాల్ లో కూడా కరోనా స్వైర విహారం చేస్తోంది. అక్కడ ఇప్పటి వరకు 6,153 మందికి కరోనా వైరస్ సోకింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version