Mumbai Cruise Drugs Case: డ్రగ్స్ కేసులో చిక్కుకున్న బాలీవుడ్ బ్యూటీ! నేడు మళ్లీ ఎన్‌సీబీ ముందుకు..

-

Mumbai Cruise Drugs Case: బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు క‌ల‌క‌లం రేపుతుంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ఎన్సీబీ.. మరింత దూకుడు పెంచింది. ఇంత‌కాలం బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుటుంబ సమస్యగా ఉన్న ఈ కేసులో మ‌రో టీ టౌన్ బ్యూటీ చిక్కుకుంది. ఆర్య‌న్ ఖాన్ తో డ్రగ్స్ విష‌యంలో వాట్సప్ చాట్ చేసిన‌ట్టు తెలుస్తుంది. దీంతో టీ టౌన్ లో మ‌రింత టెన్షన్ పెరిగింది. ఇత‌ర సెల‌బ్రెటీల గుండెల్లో ప్రకంపనలు రేపుతోంది.

తాజాగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కూడా డ్ర‌గ్స్ కేసులో సంబంధ‌మున్న‌ట్టు తెలుస్తుంది. ఆర్యన్ ఖాన్ వాట్సప్ చాట్స్‌లో ఆమె పేరు కనిపించింది. దీంతో అనన్యతో పాటు షారుఖ్‌ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ క్ర‌మంలో అనన్య, ఆర్యన్‌ మొబైల్‌, ల్యాప్‌టాప్‌, ట్యాబ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఆర్యన్‌తో అనన్య డ్రగ్స్‌పై వాట్సాప్‌ చాట్స్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ వివ‌రాల‌ను ముంబై కోర్టుకు ఆధారాలు సమర్పించారు ఎన్సీబీ అధికారులు. అనంత‌రం .. ఈ అమ్మ‌డుని ఎన్సీబీ అధికారులు రెండు గంటల పాటూ ప్రశ్నించిన‌ట్టు తెలుస్తోంది. దాదాపు రెండు గంటల పాటు విచారించారు.

ఈ క్ర‌మంలో ఆర్యన్‌ ఎలా పరిచయం ? డ్రగ్స్‌ తీసుకుంటారా ? ఎప్పుడైనా ఆర్యన్‌తో కలిసి డ్రగ్స్‌ తీసుకున్నారా ? అనే త‌దిత‌ర‌ ప్రశ్నలు అడిగిన‌ట్టు తెలుస్తుంది. ఇవాళ మరింత లోతుగా విచారించే అవకాశముంది. ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియాకు సంబంధించిన డేటాను సేక‌రించ‌డం. అలాగే.. బ్యాంకింగ్ వివ‌రాల‌ను కూడా ఆరా తీయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

దీంతో మరోసారి విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. 11గంటలకు ఎన్సీబీ అధికారుల ముందు హాజరుకానున్నారు. మరోవైపు ముంబై కోర్టు ఆర్యన్‌ కస్టడీని ఈనెల 30వరకు పొడిగించగా..ముంబై హైకోర్టులో ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఈ నెల 26న జరగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version