డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ కు ఊరట… బాంబే హై కోర్ట్ కీలక తీర్పు.

-

ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో బెయిల్ పై విడుదలైన బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు బాంబే హై కోర్ట్ లో మరోసారి ఊరట లభించింది. గతంలో డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఆర్యన్ ఖాన్ దాదాపు 20పైగా రోజుల ముంబై ఆర్థర్ రోడ్ జైలులో గడిపారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత బాంబే హై కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ప్రతీ శుక్రవారం ఎన్సీబీ అధికారుల ముందు విచారణకు హాజరవుతున్నారు.

కాగా మరోసారి బాంబే హై కోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. డ్రగ్స్‌, నేరాల కుట్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని బాంబే హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. నిందితులు ఆర్యన్‌ ఖాన్‌, అర్బాజ్‌ మర్చంట్‌, మున్‌మున్‌ ధమేచా మధ్య జరిగిన వాట్సప్‌ చాటింగ్‌లో ఎలాంటి అభ్యంతరకర అంశాలు లేవని పేర్కొంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టేందుకు ముగ్గురు నిందితులు ఓ నిర్ణయానికి వచ్చారని కోర్టు భావించేందుకు ఎలాంటి సానుకూల ఆధారం లేదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. నిందితులు ముగ్గురు ఒకే క్రూయిజ్ షిప్ లో ప్రయాణించడం ఒక్కటే వారిపై ఆరోపణలకు సాక్ష్యం కాలేదంటూ బెయిల్‌ మంజూరును న్యాయస్థానం సమర్థించుకుంది. దర్యాప్తు అధికారి నమోదు చేసిన నిందితుల నేరాంగీకార వాంగ్మూలాలపై నార్కోటిక్స్ విభాగం ఆధారపడకూడదని, ఎందుకంటే అవి చెల్లుబాటు కావని బాంబే హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news