ఐపీఎల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ : బీసీసీఐ కీలక ప్రకటన

ఐపీఎల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది బిసిసిఐ. ఐపీఎల్ 2022 సీజన్ ను మన ఇండియాలో ని నిర్వహిస్తామని బీసీసీఐ తాజాగా కీలక ప్రకటన చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ సన్మాన కార్యక్రమం లో బీసీసీఐ సెక్రటరీ జైషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐపీఎల్ 2022 టోర్నీపై కీలక ప్రకటన చేశారు బీసీసీఐ సెక్రటరీ జైషా.

వచ్చే ఏడాది రెండు కొత్త ఐపీఎల్ టీం లు వస్తున్నాయని… మెగా వేలం కూడా ఉందని ఆయన ప్రకటన చేశారు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో.. వచ్చే ఏడాది టోర్నీని ఇండియాలోనే నిర్వహించాలని తాము నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇతర దేశాల్లో నిర్వహిస్తే ఇండియన్స్ క్రికెట్ ను చాలా మిస్ అవుతున్నారని… తమ దృష్టికి వచ్చిందని ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కాగా ఐపీఎల్ 2021 కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యంలో.. దుబాయ్ లో నిర్వహించిన సంగతి తెలిసిందే.