ఐపీఎల్ 36వ మ్యాచ్‌.. పంజాబ్ టార్గెట్ 177..

-

దుబాయ్‌లో జ‌రుగుతున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2020 టోర్నీ 36వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై ముంబై ఇండియ‌న్స్ 176 ప‌రుగుల స్కోరు చేసింది. ఆరంభంలో ముంబై ప‌రుగులు రాబ‌ట్ట‌డంలో వెనుక‌బ‌డ్డా.. త‌రువాత నెమ్మ‌దిగా పుంజుకుంది. దీంతో ర‌క్ష‌ణాత్మ‌క‌మైన స్కోరు చేసింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ముందుగా బ్యాటింగ్ చేప‌ట్టి నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల‌కు 176 ప‌రుగులు చేసింది.

ముంబై బ్యాట్స్‌మెన్ల‌లో క్వింట‌న్ డికాక్‌, కృనాల్ పాండ్యా, కిర‌ణ్ పొల్లార్డ్‌లు రాణించారు. 43 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో డికాక్ 53 ప‌రుగులు చేయ‌గా, కృనాల్ పాండ్యా 30 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స‌ర్ తో 34 ప‌రుగులు చేశాడు. కిర‌ణ్ పొల్లార్డ్ 12 బంతుల్లోనే 1 ఫోర్‌, 4 సిక్స‌ర్ల‌తో 34 ప‌రుగులు చేశాడు. పంజాబ్ బౌల‌ర్ల‌లో మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ, అర్ష్‌దీప్ సింగ్‌లు చెరో 2 వికెట్లు తీయ‌గా, క్రిస్ జోర్డాన్‌, ర‌వి బిష్ణోయ్‌లు చెరొక వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version