రియల్ లైఫ్ శంకర్ దాదాలను పట్టుకున్న పోలీసులు…!

-

ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ మంగళవారం ముంబైలోని తూర్పు శివారులోని ఆరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి ఆరుగురు నకిలీ వైద్యులను అరెస్ట్ చేసారు. గత అయిదేళ్ళుగా వాళ్ళు ఆ ప్రాంతంలో డాక్టర్లుగా పని చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే తూర్పు శివారు ప్రాంతంలోని గోవాండి ప్రాంతంలో నకిలీ వైద్యులు ఉన్నట్టు క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు పక్కా సమాచారం అందింది.

దీనితో వాళ్ళు పని చేస్తున్న ఆస్పత్రుల్లో రోగులుగా జాయిన్ అయ్యారు. ఇక ఆరుగురు నకిలీ విధులకు వైద్య డిగ్రీ లేదని వాళ్లకు ఏ ధృవీకరణ లేకుండా పని చేస్తున్నారని అధికారులు గుర్తించారు. ఇక్కడ వింత ఏంటీ అంటే మెడికల్ కన్సల్టింగ్ మాత్రమే కాదు, చాలా మంది రోగులకు శస్త్రచికిత్సలు కూడా చేశారు. మురికివాడలో అక్కడి అమాయకులకు వీళ్ళు వైద్యం చేస్తున్నట్టు విచారణలో వెల్లడైంది.

వారిని గుర్తించిన తర్వాత వారి చదువుకి సంబంధించి ప్రశ్నలు వేసారు అధికారులు. అయితే నిందితులు ఇక్కడ చాకచక్యంగా వ్యవహరించి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసారు. కాని పోలీసులు మాత్రం వారిని పసిగట్టి అదుపులోకి తీసుకున్నారు. వారి వివరాలను మీడియాకు వెల్లడించారు. 11 వ తరగతి వరకు చదివిన ముకుల్ అమర్ కిస్నాదాస్ (34), 53 ఏళ్ల కమరుద్దీన్ మారుఫీ 12 వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు.

మక్సూద్ అన్సారీ, (42), 5 వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. ముక్తార్ అలీ షా (41) 5 వ తరగతి వరకు చదువుకున్నాడు, 31 ఏళ్ల కిష్మత్ షా 8 వ తరగతి వరకు చదువుకున్నాడు, మరియు 50 ఏళ్ళ తయాబ్ చౌదరి 6 వ తరగతి వరకు చదువుకున్నాడు. చట్టబద్దంగా చూస్తే వీళ్ళు వార్డ్ బాయ్స్ లేదా పారా మెడికల్ వాళ్లకు హేల్పర్స్ గా కూడా పని చేయడానికి అర్హత లేని వారని పిల్లల నుండి సీనియర్ సిటిజన్ల వరకు వాళ్ళు వైద్యం చేస్తున్నారని అధికారులు గుర్తించారు. హాజరుపరిచి ఫిబ్రవరి 10 వరకు రిమాండ్‌కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news