కర్ణాటక క్యాబినెట్‌లోకి కొత్తగా 10 మందిని తీసుకున్న యెడ్డీ

-

 

కాంగ్రెస్‌, జేడీఎస్‌ పార్టీల్లో చీలికతెచ్చి వారి సంకీర్ణ సర్కారును కూలదోసి, ఆ రెండు పార్టీల తిరగుబాటు ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ సర్కారును ఏర్పాటు చేసి, ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్న యెడ్యూరప్ప.. తాజాగా తన మంత్రిమండలిని విస్తరించారు. యెడ్యూరప్పకు మద్దతిచ్చిన తిరుగుబాటు ఎమ్మెల్యేలందరిపైనా అప్పటి స్పీకర్‌ అనర్హత వేటువేశారు. దీంతో గత డిసెంబర్ 5న 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో వారంతా బీజేపీ తరఫున పోటీచేయగా.. 12 మంది విజయం సాధించారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం వారిలో 10 మందిని యెడ్యూరప్ప ఇప్పుడు తన క్యాబినెట్‌లో చేర్చుకున్నారు.

తాజాగా యెడ్యూరప్ప క్యాబినెట్‌లో చేరినవారిలో ఎస్టీ సోమశేఖర్‌, రమేశ్‌ లక్ష్మణరావు జర్కిహోలీ, ఆనంద్‌సింగ్‌, కే సుధాకర్‌, బీఏ బసవరాజ్‌, అరబైల్‌ హెబ్బర్‌ శివరాం, హసవనగౌడ సీ పాటిల్‌, కే గోపాలయ్య, నారాయణగౌడ, శ్రీమంత్‌ బాలాసాహెబ్‌ పాటిల్‌ ఉన్నారు. కర్ణాటక గవర్నర్‌ వాజూభాయ్‌ వాలా వారితో మంత్రులుగా ప్రమాణం చేయించారు.

కాంగ్రెస్‌, జేడీఎస్‌ నుంచి బయటకు వచ్చి యెడ్యూరప్ప పంచన చేరిన 15 మంది ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్‌ అనర్హత వేటు వేయడంతో.. ఖాళీ అయిన ఆ 15 స్థానాలకు గత డిసెంబర్‌ 5న ఉప ఎన్నికలు నిర్వహించారు. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ 12 స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్‌ 2, ఇండిపెండెంట్‌ ఒక స్థానంలో గెలుపొందారు. జేడీఎస్‌కు ఒక్క స్థానం కూడా దక్కలేదు.

Read more RELATED
Recommended to you

Latest news