Big News : నాలుగో రౌండ్‌లోనూ బీజేపీ దూకుడు.. 2వేల ఆధిక్యం..

-

మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రౌండ్ రౌండ్‌కి ఫలితాలు మారుతుండడంతో ఉత్కంఠగా మారింది. పోస్టల్ బ్యాలెట్, తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ఆధిక్యం రాగా, రెండో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అనూహ్యంగా ముందంజ వేశారు. అయితే.. ఇదే ప్రతి రౌండ్‌ లోనూ కొనసాగుతోంది. మూడో రౌండ్‌లోనూ ఆధిక్యం కనబరిచిన రాజగోపాల్‌ రెడ్డి, నాలుగవ రౌండ్‌లో కూడా తన సత్తా చాటుతున్నారు. మూడో రౌండ్‌ ముగిసే సరికి మొత్తంగా టీఆర్ఎస్‌ 35 ఓట్ల ఆధిక్యంలో ఉంది. అయితే.. నాలుగవ రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి 2 వేల పై చిలుకు ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. తొలి రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం ప్రదర్శించగా.. 2,3,4 రౌండల్లో బీజేపీ ఆధిక్యం కనపరిచింది. తొలి రౌండ్‌లో మాత్రమే టీఆర్ఎస్‌ లీడ్ దక్కించుకోగా.. రెండో రౌండ్‌ నుంచి నాలుగో రౌండ్ వరకు కారు స్లోగా ముందుకు కదులుతోంది.

ఉదయం 8.30 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమైంది. ఆ తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యే సరికి టీఆర్ఎస్‌ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. అయితే.. పోస్టల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్‌కు 4 ఓట్ల ఆధిక్యం లభించింది. ఇందులో టీఆర్ఎస్‌కు 228 ఓట్లు రాగా, బీజేపీకి 224, బీఎస్పీకి 10 ఓట్లు వచ్చాయి. ఇక, తొలి రౌండ్ లెక్కింపు ప్రారంభమయ్యే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి వెయ్యికిపైగా ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 6,096 ఓట్లు రాగా, బీజేపీకి 4,904, కాంగ్రెస్‌కు 1,877 ఓట్లు పోలయ్యాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version