ఊహించని ట్విస్ట్‌లు..అదిరిపోయే వ్యూహాలు.!

-

మునుగోడు ఉపఎన్నికలో గెలుపు కోసం ప్రధాన పార్టీలు ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ ముందుకెళుతున్నాయి. ఈ రోజు ఉండే వ్యూహం, రేపు ఉండటం లేదు..అదిరిపోయే వ్యూహాలతో ఊహించని ట్విస్ట్‌లు ఇస్తున్నారు. మునుగోడులో గెలుపు కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇప్పటికే ప్రచారంలో మూడు పార్టీలు హోరాహోరీగా ఉన్నాయి. టీఆర్ఎస్-బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది.

ఓటర్లని ఆకట్టుకోవడానికి రకరకలుగా ప్రయత్నిస్తున్నారు. వారి కోసం కోట్లు కుమ్మరిస్తున్నారు. మందు, విందు అంటూ ఓటర్లని ఆకర్హించే కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే కింది స్థాయి కార్యకర్త నుంచి, నియోజకవర్గ స్థాయి నేత వరకు..ఓ రేటు పెట్టుకుని పార్టీలు కొనేసుకుంటున్నాయి. నాయకులు కూడా ఎవరు డబ్బులు ఎక్కువ వస్తే ఆ పార్టీలోకి వెళ్లిపోతున్నారు. విచిత్రంగా ఒకరోజు ఒక పార్టీలో ఉంటే..మరుసటి రోజు మరొక పార్టీలో కనిపిస్తున్నారు. మళ్ళీ తిరిగి పాత పార్టీలోకి కూడా వచ్చేవారు ఉన్నారు. అసలు చాలా ఉత్కంఠగా మునుగోడు ఉపఎన్నిక  నడుస్తోంది.

ఇక పార్టీలు కూడా ఇతర పార్టీల వారిని తీసుకొచ్చి కండువాలు కప్పేస్తున్నారు. మునుగోడులో నేతలు కండువాలు ఊహించని విధంగా మార్చేస్తున్నారు. తాజాగా మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఊహించని విధంగా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈయన బీజేపీ పెద్దలతో ఇప్పటికే భేటీ అయ్యారు. బీజేపీలోకి చేరడమే తరువాయి.

టీఆర్ఎస్ పార్టీకి దెబ్బకొట్టాలనే భాగంగా మాజీ ఎంపీని బీజేపీ లాగేసింది. బీజేపీ ఆ విధంగా ముందుకెళితే..టీఆర్ఎస్, కాంగ్రెస్స్ పార్టీకి ఎసరు పెట్టింది. ఆ పార్టీకి చెందిన పల్లె రవిని టీఆర్ఎస్‌లోకి తీసుకొచ్చింది. ఒక బీసీ నేత వెళితే..మరో బీసీ నాయకుడుని తీసుకొచ్చి లెవెల్ చేశారు. పల్లె రవి కాంగ్రెస్ సీటు ఆశించిన విషయం తెలిసిందే. కానీ ఆయనకు సీటు దక్కలేదు. దీంతో తన భార్య, చండూరు ఎంపీపీ జ్యోతితో కలిసి టీఆర్ఎస్‌లోకి వచ్చేశారు. ఇలా పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ..ఊహించని ట్విస్ట్‌లతో మునుగోడులో రాజకీయం చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version