ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో తాజాగా చోటు చేసుకున్న ఒక పరిణామం ఇప్పుడు సంచలనంగా మారింది. గుంటూరు జిల్లా మాచర్లలో కొందరు బాధితులను పరామర్శించడానికి వెళ్ళిన టీడీపీ సీనియర్ నేతలు బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా పై వైసీపీ కార్యకర్తలు దాడులకు దిగారు. ఈ దాడిలో టీడీపీ న్యాయవాది కిషోర్ కి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయన తల పగిలింది. దీనితో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఇది ఈ దాడి ఘటనపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారంపై మండిపడ్డారు. చంపేస్తారా చంపేయండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు దీనిపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి స్పందించారు. రైతుల ముసుగులో టీడీపీ నేతలు తనను హత్య చేయడానికి ప్రయత్నాలు చేసారని పిన్నెల్లి ఆరోపించారు. మాచార్లలో టీడీపీ నేతల కారు పిల్లాడిని గుద్దింది అని చెప్పారు.
అందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు వారిపై దాడులు చేసారని తప్పు చేసి కూడా వారిపై బూతులు తిట్టారని అందుకే ఈ దాడులు చేసారని అన్నారు. పల్నాడు లో ప్రశాంత పరిస్థితులు ఉన్నాయని కావాలనే చంద్రబాబు దీనిని అతిగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. విజయవాడ నుంచి టీడీపీ గుండాలు కొందరు పది కార్లలో వచ్చారని ఆయన మీడియా తో మాట్లాడుతూ వ్యాఖ్యానించడం గమనార్హం. చంద్రబాబు కావాలి అనే రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానించారు.