కరీంనగర్ టీఆర్‌ఎస్‌ లో ముసలం… మాజీ మేయర్ పార్టీకి రాజీనామా ?

-

కరీంనగర్ జిల్లా : ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కొలాహలం నెలకొన్న సంగతి తెలిసిందే. నిన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి కాగా… నేడు… స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో… టీఆర్‌ఎస్‌ పార్టీ ఊహించని షాక్‌ తగిలింది. కరీంనగర్‌ మాజీ మేయర్, టీఆర్‌ఎస్ కార్పొరేటర్ రవిందర్ సింగ్ సంచలన కామెంట్స్ చేశారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున పోటీ చేస్తున్నవారు మా పార్టీకి చెందిన వాళ్ళు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ వాళ్ళు బరిలో ఉంటే రేపే విత్ డ్రా చేసుకుంటానని… ముప్పై ఏండ్లుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకంగా పనిచేసిన అనుభవం ఉందని వెల్లడించారు. ప్రజా క్షేత్రం లో ఇంకా సేవ చేయాలనే ఆలోచనతో ఉన్నానని.. వెల్లడించారు. రేపు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని రవిందర్ సింగ్ పేర్కొన్నారు. అయితే.. ఆయన రేపు టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసే చాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ రవిందర్ సింగ్ టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేస్తే.. గంగులకు షాక్‌ తప్పదని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version