మూసీ మే లూటో.. ఢిల్లీ మే బాటో.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

-

మూసీ మే లూటో.. ఢిల్లీ మే బాటో అనేది రేవంత్ రెడ్డి విధానమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ వల్లనే మూసీ పాడైనట్టు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు.  రేవంత్ రెడ్డి మాటలు విని మోసపోయామని చెబుతున్నారు. గోదావరి నీటిని తీసుకొచ్చి మూసిలో కలుపుదామనుకున్నాం. రుణమాఫీ పేరుతో దేవుళ్లను కూడా రేవంత్ మోసం చేశాడు. మూసీ పేరుతో ఢిల్లీకి మూటలు పంపాలని చూస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యే రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్టే అన్నారు.

మూసి నదిలో రూ.4వేల కోట్లతో పలు చోట్ల STP ఏర్పాటు చేశామని తెలిపారు. దేని కోసం ఎవరి కోసం మూసీ ప్రక్షాళనకు లక్షా 50వేల కోట్లు అంటున్నారు. మూసీ కోసం లక్షా 50వేల కోట్లు, రుణమాఫీకి, రైతుబంధుకు, తులం బంగారం, రంజాన్ తోఫా కు పైసలు లేవు అంటున్నారు. మూసీ కి లక్షా 50వేల కోట్లు ఎక్కడినుంచి వస్తాయని ప్రశ్నించారు. బాపుఘాట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం పెడతామంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version