రూ.25 లక్షలతో రామాలయం గుడి నిర్మించిన ముస్లిం

-

ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం బూడిదంపాడు లో మత సామరస్యం వెల్లివిరిసింది. ఓ ముస్లిం వ్యక్తి తన సొంత డబ్బు ఖర్చు చేసి స్థానికుల సహాయంతో రామాలయాన్ని నిర్మించారు. దీంతో ఆ వ్యక్తిని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు పలువురు నెటిజన్లు. గ్రామ సర్పంచ్ అయిన షేక్ మీరాసాహెబ్ కు చిన్నప్పటినుంచి హిందూ మత ఆచారాలు, సంస్కృతి అంటే ఎంతో గౌరవం.

ఈ క్రమంలోనే ఆయన సొంత డబ్బు రూ. 25 లక్షలతో ఊరిలో రామాలయాన్ని నిర్మించాలని తెలంచారు.కాగా స్థానికులు తమకు తోచిన విధంగా విరాళాలు ఇచ్చి సాయం చేశారు. చివరికి షేక్ మీరా సాహెబ్ తలపెట్టిన గుడి నిర్మాణం పూర్తయింది. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల వారు, ఆయన గురించి తెలిసిన వారు అభినందిస్తున్నారు. ఓ ముస్లిం వ్యక్తి రూ. 25 లక్షలు ఖర్చు పెట్టి రాముడి గుడి కట్టించడం ఎంతో గొప్ప విషయం అని సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రశంసిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version