రామ మందిర నిర్మాణం కోసం ముస్లింల విరాళాలు…!

-

ఎన్నో ఏళ్ళుగా నానుతున్న అయోధ్య వివాదానికి సుప్రీం కోర్ట్ ఈ నెల 9న ఇచ్చిన తీర్పుపై హిందువులు హర్షం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. వివాదాస్పద భూమిని రాం లల్లాకు కేటాయిస్తూ రామ మందిర నిర్మాణానికి అనుమతి ఇవ్వడంపై హిందువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మసీదు నిర్మాణానికి 5 ఎకరాల భూమిని భూమిని ప్రభుత్వమే ఇవ్వాలని సుప్రీం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో రామ మందిర నిర్మాణం చేపట్టాలని హిందువులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇందుకోసం పలువురు హిందువులు కూడా విరాళాలు ప్రకటిస్తున్నారు.

ఒక్కొక్కరిగా రాముడి గుడి నిర్మాణం కోసం తమకు తోచిన సాయం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో కొందరు ముస్లింలు రామ మందిర నిర్మాణం కోసం విరాళాలు ప్రకటిస్తున్నారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్ కి చెందిన ఒక ముస్లిం సంస్థ అధినేత 51 వేలు విరాళంగా ప్రకటించారు. ఇక ఝార్ఖండ్ లో ముస్లింలు కూడా రామమందిర నిర్మాణం కోసం విరాళాలు ఇస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎక్కువగా ఇచ్చిన ముస్లింలలో వాళ్ళే ఎక్కువగా ఉన్నారని ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. అసలు దీనికి కారణం ఏంటీ…? అనే దానిపై పలువురు ఆరా తీస్తున్నారు.

ఝార్ఖండ్ లో త్వరలో ఎన్నికలు ఉన్నాయి… ఈ వివాదాస్పద భూమి విషయంలో అక్కడి ముస్లింలు తమకు వ్యతిరేకంగా మారకుండా… వారిని తమ వైపుకి తిప్పుకోవడానికి బిజెపి ఆడుతున్న రాజకీయం కారణంగానే ఈ పరిణామం చోటు చేసుకుంటుందని, తీర్పు విషయంలో ముస్లింల మద్దతు ఉంది కాబట్టే వారు విరాళాలు ఇస్తున్నారనే ప్రచారాన్ని హడావుడి లేకుండా తీసుకువెళ్లాలని బిజెపి భావిస్తుందని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు… ఏది ఎలా ఉన్నా సరే ఝార్ఖండ్ ఎన్నికల నేపధ్యంలో… ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version