సరిలేరు నీకెవ్వరు టీజర్ ఎప్పుడంటే….??

-

సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడిల తొలి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఏకె ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఎంతో భారీగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ ఇంట్రో టీజర్ మరియు పోస్టర్లు, సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేయడం జరిగింది. ఇకపోతే నేడు ఈ సినిమా టీజర్ కు సంబంధించి యూనిట్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది.

అతి త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న టీజర్ తాలూకు చిన్న బిట్ ని తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో రిలీజ్ చేసింది. మహేష్ బాబు ఆర్మీ మేజర్ గెటప్ లో గన్ పట్టుకుని సీరియస్ నడుస్తూ వస్తున్న ఆ వీడియో, త్వరలో రిలీజ్ కాబోయే టీజర్ లోనిదని తెలుస్తోంది. కాగా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ టీజర్ ని ఈనెల 23న రిలీజ్ చేయబోతున్నట్లు చెప్తున్నారు. కొద్దిరోజుల క్రితం టీజర్ కట్ కోసం సినిమాలోని నాలుగు ముఖ్యమైన సీన్స్ తీసుకుని కట్ చేయడం జరిగిందట.

Sarileru Neekevvaru Movie Teaser Release On november 23

ప్రస్తుతం మిక్సింగ్ స్టేజ్ లో ఉన్న ఈ టీజర్ లో యాక్షన్ మరియు ఎంటర్టైన్మెంట్ అంశాలు కలగలిసి ఉండబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. సీనియర్ నటి విజయశాంతి కొన్నేళ్ల తరువాత టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, సంగీత, మురళి శర్మ, రావు రమేష్, రఘు బాబు, హరితేజ, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 2020 జనవరి 12న థియేటర్స్ లోకి తీసుకురానున్నారు….!!

Read more RELATED
Recommended to you

Exit mobile version