వేసవికాలంలో అనారోగ్య సమస్యలు బాఱిన పడకుండా ఉండాలంటే మంచి ఆరోగ్యకరమైన పద్ధతుల్ని పాటిస్తూ ఉండాలి. బాడీని ఆరోగ్యంగా చల్లగా ఉంచుకోవడానికి చూసుకోవాలి. వేసవి కాలంలో కూరగాయలను తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి నీటి శాతం అధికంగా ఉండే కూరగాయలను తీసుకుంటే హైడ్రాయిడ్ గా ఉండడానికి అవుతుంది. వేసవికాలంలో ఈ కూరగాయలను తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. మరి ఎటువంటి కూరగాయలను వేసవిలో తీసుకోవచ్చు అన్నది చూద్దాం.
కీరదోస:
దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, కీరదోసని తీసుకుంటే హైడ్రేట్ గా ఉండొచ్చు. ఇది బాడీని చల్లగా మారుస్తుంది. నిమ్మరసం అల్లం తో పాటుగా మీరు దీన్ని తీసుకోవచ్చు లేదంటే సలాడ్ మీద కూడా వేసుకొని తీసుకోవచ్చు.
మెలన్స్:
వేసవికాలంలో పుచ్చకాయ కర్బూజా వంటివి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది పోషక పదార్థాలతో పాటుగా వేసవిలో వచ్చే సమస్యల నుండి దూరంగా ఉండొచ్చు.
ఆకుకూరలు:
ఆకుకూరలు కూడా వేసవికాలంలో తీసుకుంటూ ఉండండి. వీటిలో కాల్షియం అధికంగా ఉంటుంది దాంతో పాటుగా కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. తోటకూర పాలకూర క్యాబేజీ మొదలైన వాటిని మీరు తీసుకోవచ్చు.
అవకడో:
ఇది సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. అవకాడో ని తీసుకుంటే కూడా చాలా మేలు కలుగుతుంది సో దీన్ని కూడా సమ్మర్ లో తీసుకుని ఆరోగ్యంగా ఉండండి.
పుదీనా:
పుదీనాలో కూలింగ్ గుణాలు ఉంటాయి. వేసవి లో పుదీనా ని తీసుకుంటే చాలా చక్కటి ప్రయోజనాలని పొందొచ్చు. జీర్ణ సమస్యల మొదలు తలనొప్పి వికారం నీరసం వంటి సమస్యల్ని దూరం చేస్తుంది. అలానే వేసవిలో కొబ్బరి, చేప, పెరుగు, బట్టర్ మిల్క్, నిమ్మరసం, మామిడి పండ్లు వీటన్నిటిని కూడా మీరు తీసుకోవచ్చు. సమస్యలు ఏమి లేకుండా ఆనందంగా ఆరోగ్యంగా జీవించొచ్చు.