ఈ సంవత్సరం నుండి యూనివర్సిటీ టీచర్ University Teacher కింద పని చేయాలంటే పిహెచ్డి మరియు నెట్ తప్పకుండా ఉండాలని కొత్త రూల్స్ ప్రకారం చెప్పడం జరిగింది. అయితే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ NET తో పాటు PhD కూడా తప్పనిసరిగా ఉండాలని తెలుస్తోంది.
గతంలో ఎలా అంటే..?
గతంలో పీహెచ్డీ లేదా నెట్ మాస్టర్ డిగ్రీ ఉంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అయితే నెట్ పరీక్ష పాస్ అయిన వాళ్ళకి 5 నుండి 10 మార్కులు వెయిటేజ్ ఇచ్చేవారు. అదే PhD పాస్ అయిన వాళ్ళకి 30 మార్కులు వెయిటేజ్ ఇచ్చేవారు.
2018 లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కొత్త రెగ్యులేషన్స్ ని విడుదల చేసింది. యూనివర్సిటీలో ఉపాధ్యాయుల కింద పని చేయాలంటే కచ్చితంగా PhD ఉండాలని తెలిపింది. అయితే మూడేళ్ల పాటు సమయం ఇచ్చామని ఇప్పటి నుండి అంటే 2021 నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ల కింద పని చేయాలంటే పీహెచ్డీ ఉండాలని తెలిపింది.