‘ఐతారం మా సిన్నోడి’ పెండ్లి.. తెలంగాణ యాసలో పెళ్లి పత్రిక..

-

ప్రస్తుత కాలంలో పెళ్లి ఓ ఈవెంట్‌గా మారిపోయింది. ఎంగేజ్‌ మెంట్‌ నుంచి మొదలుకొని కొత్త కొత్త పదాలు, అర్థాలతో సోషల్‌ మీడియాల్లో అప్‌లోడ్‌ చేయడం, స్టెటస్‌లు పెట్టడం చేస్తున్నారు. తన పెళ్లి ఇతరుల కన్న విభిన్నంగా ఉండాలని కొందరు.. ఇతరులు ఎవరూ లేయరాదనే మరి కొందరు వింత వింతగా పెళ్లిలు చేసుకుంటున్నారు. గతంలో పెళ్లి పత్రిల్లో అందరికీ ఒకే పదాలతో ప్రింట్‌ చేసేవారు. రోజురోజులుకు పత్రికల్లో మార్పు కొత్తకొత్త పదాల చేరికలతో ప్రింట్‌ చేయిస్తున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రం అందరికీ భిన్నంగా తన శుఖలేఖ ముద్రించాడు.

ఇలా ప్రింట్‌ చేయడంతో ఇదే మొదటిసారి అని అన్ని ప్రింటింగ్‌ ప్రెస్‌ వాళ్లు చెబుతున్నారు. ఎందుకంటే అందులో ఉన్న పదాలు, అక్షరాలన్నీ తెలంగాణ భాషలోనే ముద్రించారు.స్వస్తిశ్రీ చాంద్రమాన సంవత్సర, ఆదివారం, కనిష్ఠ పుత్రుడు, కల్యాణ వేదిక లాంటి పదాలు లేకుండా అంతా తెలంగాణ వాడుక భాషలోనే ‘‘లగ్గం (ముహూర్తం) íపిలిశెటోళ్లు (ఆహ్వానించేవారు), బువ్వ( భోజనం), ఐతారం ( ఆదివారం) అంబటాల్లకు( మధ్యాçహ్నాం) 11.37 గొట్టంగ, మా సిన్న పిల్లగాడు, తొలుసూరి బిడ్డ, ఎర్కనా’’ వంటి పదాలతో ఉన్న పత్రిక తెలంగాణ యాసను గుర్తుకు తెచ్చింది.

ఎవరీ చందు..

ఈ వెరైటీ పత్రిక రాయించింది మై విలేజ్‌ షో’లో ఓ ఆర్టిస్ట్‌ చంద్రమౌళి (చందు). తన పెళ్లి పత్రికను విభిన్న రీతిలో ముద్రించి మరోసారి షోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాడు. ఆహ్వానం పొందినవారంతా ‘అన్న, లగ్గం పత్రిక మస్తుగున్నదే’ గిట్లంటి పత్రిక నేను ఎప్పుడూ సూడలేదు అనే తెలంగాణ యాసలోనే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version