క‌రోనా బాధితుల‌ను ఆదుకునేందుకు ముందుకు రండి.. వాలంటీర్‌గా మారండి..!

-

క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్ర‌స్తుతం దేశం చాలా క్లిష్ట‌త‌ర ప‌రిస్థితిలో ఉంది. ప్ర‌స్తుతం ఉన్న ఇబ్బందిక‌ర ప‌రిస్థితిలో ప్ర‌జ‌ల‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ధైర్యం చెబుతున్నాయి. సెల‌బ్రిటీలు, ప్ర‌ముఖులు త‌మ వంతు స‌హాయం చేసేందుకు ముందుకు వ‌స్తున్నారు. అయితే దేశంలో ఉన్న పేద‌లు, అన్నార్థుల‌కు స‌హాయం అందించేందుకు స‌మాజంలో ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ త‌మ‌కు చేత‌నైనంత స‌హాయం చేయాల‌ని.. అందుకు గాను ప్ర‌జ‌లు వాలంటీర్లుగా మారి ముందుకు రావాల‌ని కేంద్రం పిలుపునిస్తోంది.

క‌రోనా వ‌ల్ల కష్టాలు ప‌డుతున్న వారికి అన్ని రకాలుగా స‌హాయం అందించేందుకు స‌మాజంలోని ఎవ‌రైనా వాలంటీర్లుగా మారి ముందుకు రావ‌చ్చ‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో న‌డిచే mygov.in వెబ్‌సైట్ పిలుపునిచ్చింది. ఈ మేర‌కు ఆ సైట్ సీఈవో అభిషేక్ సింగ్ ట్వీట్ చేశారు. స‌మాజంలో ఉన్న ఎవ‌రైనా స‌రే.. త‌మ వ‌ద్ద ఉన్న వ‌స్తువులు, డ‌బ్బు, ఆహార ప‌దార్థాలు, ఇత‌ర సామ‌గ్రిని క‌రోనా బాధితుల కోసం అంద‌జేయ‌వ‌చ్చ‌ని.. అందుకు గాను https://self4society.mygov.in/volunteer అనే వెబ్‌సైట్‌లో వాలంటీర్‌గా మార‌వ‌చ్చ‌ని ఆయ‌న సూచించారు.

కాగా ఇప్ప‌టికే ఈ సైట్‌లో క‌రోనా బాధితుల‌కు సేవ‌లందించేందుకు 50వేల మంది స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చి వాలంటీర్లుగా రిజిస్ట‌ర్ చేసుకున్నారు. ఈ క్ర‌మంలో నిత్యం ఈ సైట్‌లో రిజిస్ట‌ర్ చేసుకునే వాలంటీర్ల సంఖ్య‌ను కూడా ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేయ‌నున్నారు. అలాగే ఈ సైట్‌లో మ‌రో 2200 స్వ‌చ్ఛంద సంస్థ‌లు కూడా క‌రోనా బాధితుల‌కు స‌హాయం చేసేందుకు రిజిస్ట‌ర్ చేసుకున్నాయి. మీరు కూడా.. కరోనా బాధితుల‌ను ఆదుకునేందుకు.. స‌హాయం ఏ రూపంలో అయినా చేయ‌వ‌చ్చు.. డ‌బ్బులు లేదా ఆహార ప‌దార్థాలు.. వైద్య సామ‌గ్రి.. ఇత‌ర స‌హాయం ఏదైనా.. స‌రే.. మీరు చేసేది.. క‌రోనా బాధితుల‌కు ఎంతో అండ‌గా నిలుస్తుంది.. వారికి ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో ఆ స‌హాయం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version