నది తీరంలో ఉన్న 1000 రాళ్ళ పై చెక్కబడి యున్న శివలింగాలు అద్భుత అనుభూతినిస్తాయి. ప్రతి రాయిపై చెక్కబడిన శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం కూడా ఉండడం విశేషం. వేయి శివ లింగాలని చూచుటకు వెళ్ళటమే ఓ మహా అద్భుతం అని చెప్పాలి. నిజానికి వెయ్యి లింగములు కలిగిన పూజ్యమైన నది. నిజానికి 1000 శివలింగాలుఒకే చోట ఉండటం ఆశ్చర్యంగా కలగచేస్తుంది. అయితే ఈ నది మధ్యలో శివలింగాలు ఎలా వచ్చాయి ? అసలు ఇవి ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉత్తర కర్నాటకలోని సిర్సీ తాలూకా లో ఉన్న షాల్మలా నది తీరంలో ఉన్న 1000 రాళ్ళ పై చెక్కబడి యున్న శివలింగాలు అద్భుత అనుభూతినిస్తాయి. ప్రతి రాయిపై చెక్కబడిన శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం కూడా ఉంటుంది. ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున వందలాది భక్తులు సహస్త్రలింగానికి వస్తుంటారు. సహస్ర లింగాలంటే కన్నడ బాషలో 1000 లింగాలని అర్ధం. సిర్సీ తాలుకా నుండి యల్లాపూర్ కు వెళ్లేదారిలో 17 వ కిలోమీటర్ దగ్గర ఈ స్థలం ఉన్నది.
అలాగే ఇక్కడ శ్రీరాముడు, లక్ష్మి దేవి, బ్రహ్మ విగ్రహాలను కూడా చూడవచ్చును. నదిలో నీళ్లు తక్కువుగా ఉంటే 1000 లింగాలనూ చూడవచ్చు. శీతాకాలంలో గానీ లేక ఎండాకాలం ప్రారంభంలో గానీ ఈ చోటికి వెడితే నదిలో నీళ్లు తక్కువగా ఉంటాయి. గనుక అన్ని లింగాలనూ దర్శనం చేసుకోవచ్చు. ఈ ప్రదేశం ఇంకా పూర్తిగా అభివృద్ధి కాలేదు. ఇక్కడ మీరు బసచేయటానికి పెద్ద హోటళ్లు లభించకపోవచ్చు.
చరిత్రకారులు ప్రకారం, శివ లింగాలని 1678-1718 సమయంలో సదాశివ రాయ సిర్సి రాజుగా పరిపాలించేవాడు. ఇతను విజయనగర రాజ్యానికి చెందిన రాజు. ఇతనే ఈ శివలింగాలను చెక్కించారని నమ్ముతున్నారు. ఇలా ఎన్నో కథనాలు ఉన్నాయి కానీ వాటిపై స్పష్టత లేదు. ఇప్పటికీ కూడా ఈ 1000 రాళ్లపై చెక్కబడిన లింగాలు మిస్టరీగానే ఉన్నాయి.