ఎన్.టి.ఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ భారీ మల్టీస్టారర్ ..?

-

ప్రస్తుతం ఎన్.టి.ఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న సంగంతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రాం చరణ్ మరో హీరోగా నటిస్తుండగా అల్లూరి సీతారామరాజు, కొమరం భీం ల నిజ జీవిత పాత్రలకి ఫిక్షన్ స్టోరిని యాడ్ చేసి భారీ మల్టీ స్టారర్ గా రాజమౌళి రూపొంస్తున్నారు. ఈ పాన్ ఇండియా సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్, సీనియర్ హీరో అజయ్ దేవ్ గన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రాం చరణ్ పాత్ర కి సంబంధించిన వీడియో టీజర్ ని రిలీజ్ చేసిన చిత్ర బృందం త్వరలో ఎన్.ట్.ఆర్ పాత్ర కి సంబంధించిన టీజర్ వీడియోతో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ఇక ఈ సినిమాని 2021 సంక్రాంతికి టార్గెట్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

అయితే ఈ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ త్రివిక్రం దర్శకత్వంలో నటించడానికి రంగం సిద్దమవుతుంది. ఈ సినిమా ఎన్.టి.ఆర్ మైల్ స్టోన్ సినిమా (30) కావడం విశేషం. “అయినను పోయిరావలే హస్తినకు” అన్న టైటిల్ తో తెరకెక్కబోయో ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తుందన్న టాక్ ఉంది. ఇంతకముందు ఎన్.టి.ఆర్-త్రివిక్రం-పూజా హెగ్డే కాంబినేషన్ లో అరవింద సమేత వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో మళ్ళీ అదే మ్యాజిక్ ని రిపీట్ చేయాలనుకుంటున్నారట.

ఇక ఈ రెండు సినిమాల తర్వాత ఎన్.టి.ఆర్ మైత్రీ మూవీ మేకర్స్, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మించే భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తాడని తాజా సమాచారం. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కే.జి.ఎఫ్ 2 ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్ కాగానే ఎన్.టి.ఆర్ సినిమాకి కథ సిద్దం చేసే పనిలో పడతాడట. అంతేకాదు ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రాం కూడా నటించే అవకాశాలున్నాయని సమాచారం. ఇప్పటి వరకు ఈ నందమూరి సోదరులిద్దరు కలిసి నటించలేదు. అందుకే ఈ సినిమాలో నటించడానికి ప్లాన్స్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా ఎన్.టి.ఆర్ 31 వ సినిమాగా తెరకెక్కనుంది.

Read more RELATED
Recommended to you

Latest news