సమంత నీకో దండం.. చైతూతో కలిసి పో : ఫ్యాన్స్ రచ్చ

-

టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య మరియు సాయిపల్లవి నటించిన “లవ్ స్టోరీ ” సినిమా భారీ అంచనాలతో ఇవాళ విడుదలైన సంగతి తెలిసిందే. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా విడుదల అయింది. మొదటగా యుఎస్ఎలో విడుదలైన లవ్ స్టోరీ సినిమా మంచి కలెక్షన్లను సంపాదించింది. ఇక ఇక రెండు తెలుగు రాష్ట్రాల సినిమా థియేటర్లలోనూ లవ్ స్టోరీ హవా నడుస్తోంది.

మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు తగ్గట్టుగా సినిమా ఉండడంతో.. థియేటర్ల వద్ద క్యూ కట్టారు జనాలు. అటు సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఉండటంతో… మంచి ఓపెనింగ్స్ ను సాధిస్తోంది లవ్ స్టోరీ మూవీ. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు… నాగచైతన్య మరియు సమంత లవ్ స్టోరీ గురించే మాట్లాడుతున్నారు.

అయితే ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ వద్ద… నాగచైతన్య ఫ్యాన్… లవ్ స్టోరీ మూవీ చూసిన అనంతరం భావోద్వేగానికి గురయ్యారు. లవ్ స్టోరీ సినిమా… చాలా బాగుందని… కింగ్ నాగార్జున కొడుకు గా నాగచైతన్య మరోసారి నిరూపించుకున్నాడు అని పేర్కొన్నాడు. ఇలాంటి ప్రేమ కథ చిత్రం… ఇప్పటివరకు ఏ డైరెక్టర్ చేయలేదని శేఖర్ కమ్ముల కొనియాడారు. అలాగే ఈ లవ్ స్టోరీ సినిమా ను సమంత చూడాలని…. సూచించాడు. అంతేకాదు… దయచేసి నాగచైతన్య మరియు సమంత ఇద్దరూ కలవాలని విజ్ఞప్తి చేశాడు ఆ ఫ్యాన్.  ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news