16 ఏళ్లలోపు పిల్లలని అన్ని సినిమా షోలకు అనుమతించవచ్చు అంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. తెలంగాణలో బెనిఫిట్, ప్రీమియర్, స్పెషల్ షోలపై ఇవాళ తెలంగాణ హైకోర్టు.. విచారణ చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు..కీలక వ్యాఖ్యాలు చేసి.. ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణలో బెనిఫిట్, ప్రీమియర్, స్పెషల్ షోలకు నిరాకరణ తెలిపింది తెలంగాణ హైకోర్టు.

నాలుగు రెగ్యూలర్ షోలకు 16 ఏళ్లలోపు పిల్లల ఎంట్రీకి హైకోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది.. జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది తెలంగాణ హైకోర్టు.. తదుపతి విచారణ మార్చి 17కి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.
- 16 సంవత్సరాల లోపు పిల్లలని అన్ని సినిమా షోలకు అనుమతించవచ్చు
- ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలకు మాత్రం అనుమతి లేదు
- జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులు సవరించిన హైకోర్టు
- కేసు తదుపరి విచారణ మార్చి 17 కి వాయిదా