దసరా కానుకగా నాగ చైతన్య మూవీ తండేల్.. శరవేగంగా షూటింగ్ పనులు

-

సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగచైతన్య గురించి మనం చెప్పనక్కర్లేదు. నాగ చైతన్య మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్టు ను సాధించి మంచి పేరును సంపాదించుకున్నాడు. నాగచైతన్య, సాయి పల్లవి తండెల్ సినిమాలో హీరో హీరోయిన్లుగా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రంలో నాగచైతన్య మత్స్యకారుడు రోల్ లో కనిపించనున్నాడు. సాయి పల్లవి పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటిస్తోంది.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ఈ మూవీలోని గ్లింప్స్ రిలీజ్ అయ్యాక ఆ మూవీ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మాతగా చేస్తున్నాడు.అల్లు అరవింద్ సగర్వంగా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని చందూ మొండేటి ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం మేకర్స్ హైదరాబాద్ లో పాకిస్థాన్ సెట్ వేసి షూట్ చేస్తున్నారు.చందూ మొండేటి నటీనటుల గెటప్స్, బాడీ లాంగ్వేజ్, కాస్ట్యూమ్స్, యాసలతో సహా ప్రతిదీ పర్ఫెక్ట్ గా కనిపించేలా చూసుకుంటున్నారట. ఈ మూవీ దసరా కానుకగా థియేటర్లలోకి రాబోతున్నట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news