ఆమ్ ఆద్మీ పార్టీ కీలక ప్రకటన చేసింది. తమ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ అరెస్టుకు నిరసనగా ఈనెల 26న ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చింది. అలాగే ఈ సంవత్సరం పార్టీ శ్రేణులెవరూ హోలీ జరుపుకోవద్దని నిర్ణయించింది. రేపు ఢిల్లీలోని షాహిదీ పార్కులో దేశాన్ని కాపాడతామంటూ ప్రతిజ్ఞ నిర్వహించనున్నట్లు పేర్కొంది.
ఇదిలా ఉంటే… ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవాల్ అరెస్టుపై ఆయన సతీమణి సునీత మొదటిసారిగా స్పందించారు. ‘కేజీవాల్ ఎప్పుడూ ఢిల్లీ ప్రజల తరఫున నిలబడ్డారని, ఆయనని అరెస్ట్ చేయడం అక్రమం’ అని అన్నారు. ఈ కేసు నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేస్తే సునీత లేదా విద్యాశాఖ మంత్రి అతిశీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.