Krishna Vrinda Vihari Movie Review: ‘కృష్ణ వ్రింద విహారి’తో నాగశౌర్య హిట్ కొట్టాడా?

-

ఫ్యామిలీ హీరోగా టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. ఆయన నటించిన తాజా చిత్రం కృష్ణ వ్రింద విహారి. భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్. కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్ బ్యానర్ శంకర ప్రసాద్ ముల్పూరి సమర్పణలో హీరో నాగశౌర్య తల్లి ఉషా ముల్పూరి ఈ మూవీని నిర్మించారు. షిర్లీ సేటియా హీరోయిన్ గా పరిచయం అయ్యింది. మరి గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగ శౌర్యకు ఈ మూవీ ఎంత మేరకు కలిసి వచ్చింది. ప్రేక్షకులు ఏమంటున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.

కథేంటీ అంటే? నాగశౌర్య (కృష్ణ) ఒక సాధారణ బ్రాహ్మణ కుర్రాడిగా నటించాడు. కృష్ణ తన ఆఫీస్‌లో పనిచేసే వ్రింద (షిర్లీ సెటియా) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆమెను ఎలాగైనా ఇష్టపడేలా చేసేందుకు తిప్పలు పడతాడు. చివరికి ఆమెను ప్రేమించేలా చేసుకుంటాడు. ఈ మూవీలో వారిద్దరికి పెళ్లి కూడా అవుతుంది. పెళ్లి అనంతరం కృష్ణ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటాడు.. ఇరువురి కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయి.. వేర్వేరు సాంప్రదాయ కుటుంబాల మధ్య వీరి వైవాహిక జీవితం సాగింది అనేది స్టోరీగా చెప్పవచ్చు.

ఎవరు ఎలా చేశారంటే… నాగశౌర్య అద్భుతంగా తనదైన నటనతో నటించాడు. విభిన్నమైన లుక్‌తో ఆకట్టుకున్నాడు. నాగశౌర్య నటన అద్భుతంగా ఉంది. కానీ, హీరోయిన్ షిర్లీ సెటియా నటన ఆకట్టుకునేలా లేదు. లుక్ పరంగా పర్వాలేదని అనిపించింది. ఇరువురి మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది. మిగతా పాత్రల్లో తమ పాత్ర మేరకు నటించారు.

టెక్నికల్‌గా చూస్తే.. స్టోరీని ఇంకా బలంగా ఉండాల్సింది. స్క్రీన్‌‌ప్లే ఆకట్టుకునేలా లేదనే చెప్పాలి. సీన్లలో ఎక్కడ కూడా లాజిక్ కనిపించలేదు. ఎమోషనల్ సీన్లలోనూ పెద్దగా ప్రేక్షకులను అలరించేలా లేవు. మ్యూజిక్ యావరేజ్‌గా ఉంది. బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ విషయంలో అదే పరిస్థితి కనిపిస్తోంది.

సినిమా ప్లస్, మైనస్ సినిమాటోగ్రపీ యావరేజ్‌గానే ఉంది. కొన్నిసీన్లు తేలిపోయినట్టుగా అనిపించింది. ఎడిటింగ్‌ లోపాలు బాగా కనిపించాయి. నిర్మాణాత్మక విలువలు కూడా అంతమాత్రంగానే ఉన్నాయి. మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే.. సెకండ్‌ హాఫ్‌ కొన్ని సన్నివేశాలు బాగానే ఉన్నాయి. మూవీలో రాధిక మరియు వెన్నెల కిషోర్ బ్రహ్మాజీ రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలో తనదైన కామెడీ సన్నివేశాలతో అదరగొట్టేసారు. అలాగే మహతి స్వర సాగర్ అందించిన సంగీతం సినిమాకి చాలా ప్లస్ అయిందని చెప్పవచ్చు.

చివరగా… ఈ సినిమా మాత్రం కొత్త సినిమా కంటెంట్ అయితే కాదు.. అలాగని సినిమా బోర్ కొట్టదు.. పాత సినిమా కథ లాగే ఉన్నా ఫన్నీ సన్నివేశాలతో, ఫీల్ గుడ్ పాటలతో సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. కృష్ణ ఫ్యామిలీతో హీరోయిన్ కలిసిపోయే సందర్భంలో పండించిన కామెడీ చాలా సహజంగా ఉంటుంది. మొదటి భాగం మొత్తం లవ్ చుట్టే తిరుగుతుంది. దీనికి తగ్గట్టు కథ ఇంకా కొంచెం బలంగా ఉంటే సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళి పోయేది. ముఖ్యంగా ఈ సినిమా స్టార్టింగ్ లో ఏ ముందే పాట అందరినీ ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. మొత్తానికి సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పలేం, అలాగని చెత్తగా ఉందని కూడా చెప్పలేం. మొత్తానికి సినిమా చూడవచ్చు.

రేటింగ్ 2.5/5

Read more RELATED
Recommended to you

Exit mobile version