మెగా బ్రదర్ నాగబాబు మరో సంచాలనానికి తెరతీశారు. హిందూ దేవాలయాలు ప్రభుత్వ అధీనంలో ఉండకూడదని బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్ ఓ న్యూస్ చానెల్‌లో మాట్లాడిన వీడియోను నాగబాబు పోస్ట్ చేశారు. అన్ని హిందూ దేవాలయాల నిర్వహణ ప్రభుత్వంతో సంబంధంలేని వారి చేతుల్లోనే ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. ‘జీవితాల్ని హిందు ధర్మం కోసం త్యాగం చేసిన చాగంటి కోటేశ్వర రావు గారు, గరికపాటి నరసింహ రావు గారు, గీత గంగాధర్ గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు లాంటి ఇంకా ఎందరో గొప్ప వ్యక్తుల్ని హిందు దేవాలయాలను నిర్వహించే స్థానంలో చూడాలని ఉంది’ అని నాగబాబు ట్వీట్లు చేశారు. ప్రార్థనాలయాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదని ఆయన చెప్పుకొచ్చారు.
Mp satya pal singh said the demand from people any hindu temples should not governed by state governments.good move from the central govt at last.i too demand same all hindu temples should be run non govt persons and highest religious people in hindu dharma…contdg pic.twitter.com/SaUpo432qU
— Naga Babu Konidela (@NagaBabuOffl) June 6, 2020