చిరంజీవి, పవన్ ల జోలికి వస్తే.. తాట తీస్తా – నాగబాబు

-

మెగాస్టార్‌ చిరంజీవి బర్త్ డే వేడుకల్లో నిన్న హైదరాబాద్‌ జరిగాయి. అయితే.. చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత సాధించిన మెగాస్టార్ చిరంజీవిని ఎందుకు విమర్శిస్తారు ? అని ఆగ్రహించారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబాన్ని కూడా విమర్శిస్తారు.. ఎందుకు విమర్శిస్తారో ఇప్పటికీ నాకు తెలీదని నిప్పులు చెరిగారు నాగబాబు.

అన్న, తమ్ముడిని విమర్శిస్తే తాట తీస్తానని వార్నింగ్‌ ఇచ్చారు. చిరంజీవి ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారన్నారు. చిరంజీవిని ఏమైనా అంటే అడ్డంగా చీల్చేసే అభిమానులున్నారు…ఏదో చేయాలనే తపన ఉన్నవాడు పవన్ కళ్యాణ్ అని వెల్లడించారు.

పవన్ డైరెక్టర్ అవుతానంటే …హీరో చేసింది చిరంజీవి అని గుర్తు చేశారు. ఏపీ రాజకీయ ముఖ చిత్రం మార్చే దమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్‌ అని.. అలాంటి పవన్ ను ఇచ్చిన వ్యక్తి చిరంజీవి అని పేర్కొన్నారు. కుళ్ళి పోయిన రాజకీయాలపై అన్నకి మద్దతు ఇచ్చాను.. ఇప్పుడు తమ్ముడికి మద్దతు ఇస్తానని చెప్పుకొచ్చారు నాగబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version