నాగ‌లాండ్ ఘ‌ట‌న మృతుల కుటుంబాల‌కు రూ. 16 ల‌క్ష‌ల ప‌రిహారం

-

ఉగ్ర‌వాదులు అనుకుని నాగ‌లాండ్ లో పౌరుల‌ను భ‌ద్ర‌తా బ‌ల‌గాలు కాల్చి చంపిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న లో మొత్తం 14 మంది పౌరులు మృతి చెందారు. ఈ 14 మంది మృతుల అంత్య క్రియాల‌కు నాగ‌లాండ్ ముఖ్య మంత్రి నిఫియు రియో పాల్గొన్నారు. ఈ ఘ‌ట‌న లో మృతి చెందిన 14 మంది కుటుంబాల‌ను ఆదుకుంటామ‌ని ముఖ్య మంత్రి నిఫియు రియో ప్ర‌క‌టించారు. మృతుల కుటుంబాల‌కు కేంద్ర ప్ర‌భుత్వ రూ. 11 ల‌క్ష‌ల చొప్పున న‌ష్ట పరిహారం ప్ర‌క‌టించింద‌ని తెలిపారు.

అలాగే రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి కూడా రూ. 5 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇస్తామ‌ని సీఎం నిఫియు రియో ప్ర‌క‌టించారు. దీంతో మృతుల కుటుంబాల‌కు మొత్తం రూ. 16 ల‌క్ష‌ల చొప్పున న‌ష్ట పరిహారం అంద‌బోతుంది. అయితే దారుణ మైన ఘ‌ట‌న లో 14 మంది సాధార‌ణ పౌరుల తో పాటు ఒక జ‌వాన్ కూడ మ‌ర‌ణించాడు. అయితే ఈ ఘ‌ట‌న తో ఈశాన్య రాష్ట్రాల లో ఉండే ఆర్మ్ డ్ ఫోర్సెస్ స్పెష‌ల్ ప‌వ‌ర్స్ చ‌ట్టాన్ని ర‌ద్దు చేయాల‌నే డిమాండ్ మ‌రో సారి కేంద్ర ప్ర‌భుత్వం ముందుకు వ‌చ్చింది. అయితే ఎక్కడ లేని విధం గా ఈ చట్టం ద్వారా జ‌వాన్ల కు ఫైరింగ్ అనుమ‌తి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version