Nagarjuna – Bangarraju: సంక్రాంతి బ‌రి నుంచి త‌ప్పుకోనంటున్న’బంగార్రాజు’.. ఇంత‌టీ రిస్క్ అవ‌స‌ర‌మా ? పోటీలో నెగ్గెనా?

-

Nagarjuna – Bangarraju : టాలీవుడ్ మ‌న్మ‌ధుడు అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన సోగ్గాడే చిన్ని నాయన. గ‌తంలో ఈ సినిమా ఎలాంటి సూపర్ హిట్ అందుకుందో.. అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ఈ సూప‌ర్ హిట్ మూవీకి సీక్వెల్‌‌‌గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘బంగార్రాజు’. ఈ సినిమాతో ప్రేక్షకులను మరోసారి మెస్మరైజ్‌ చేయడానికి సిద్దంగా ఉన్నారు. వాస్త‌వానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సిఉండగా కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.

ఎట్టకేలకు చిత్ర షూటింగ్ పూర్తిచేసుకుంది. డిసెంబ‌ర్ చివ‌రి నాటికి పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ వ‌ర్క్ పూర్తి కానున్న‌ది. సంక్రాంతి బ‌రిలో నిలువ‌డానికి సిద్దంగా ఉంది. ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటిస్తున్నారు. చైతూకు జోడీగా కృతి శెట్టి నటిస్తుండగా, నాగార్జునకు జంటగా రమ్యకృష్ణ కనిపించనుంది.

సినీ వ‌ర్గాల టాక్ ప్ర‌కారం… ఈ సినిమాను జనవరి 12న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే థియేట్రికల్‌తో పాటు డిస్ట్రిబ్యూటర్స్‌తో చర్చలు పూర్తైయినట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల ‘ఆర్ఆర్ఆర్’ సినిమా జవనరి 7న రిలీజ్ అయ్యి.. సంక్రాంతి కి బాక్సాఫీస్ పోరులో రంగంలోకి దిగుతోంది. అలాగే.. ప్రభాస్ హీరోగా నటిస్తున్న‌ ‘రాధే శ్యామ్’ జనవరి 14న విడుదల చేయ‌నున్నారు. ఈ రెండు కూడా ఇత‌ర సినిమాల‌కు గట్టి పోటీ ఇవ్వ‌నున్నాయి.

ఇప్ప‌టికే .. రాజమౌళి డైరెక్షన్ లో తెర‌కెక్కెతున్న ఆర్ఆర్ఆర్ సినిమా.. స‌రికొత్త‌ రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ అని ఇండ‌స్ట్రీ టాక్. దీంతో రిస్క్ ఎందుక‌ని పవన్ కళ్యాణ్, రానాల భీమ్లా నాయక్, మహేష్ బాబు.. సర్కారు వారి పాట సంక్రాంతి రేసు నుంచి తప్పుకొబోతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది.

కానీ కింగ్ నాగార్జున మాత్రం త‌గ్గేదేలే అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ట‌. సంక్రాంతి బరిలో నిలిచి సై అంటే సై అని టాప్ సినిమాల‌కు గ‌ట్టి పోటీగా నిలువ‌నున్నార‌ట‌. రిలీజ్ తేదిని కూడా త్వ‌ర‌లో అఫిసియ‌ల్ గా ప్ర‌క‌టించ‌నున్నార‌ట‌. ఈ విష‌యంలో నాగార్జున చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారట‌.

ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లాంటి పాన్ ఇండియా సినిమాలకు పోటీగా తన సినిమాను రిలీజ్ చేయాలని నాగ్ తీసుకున్న నిర్ణయం అభిమానులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. రాజామౌళి ఆర్ఆర్ఆర్ గానీ, ప్ర‌భాస్ రాధేశ్యామ్ ల‌కు పాజిటివ్ టాక్ వస్తే.. మరో సినిమాను చూడటానికి ఆసక్తి చూపే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎలాంటి విజ‌యం సాధిస్తుందో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news