వైరల్ గా మారిన నాగ‌శౌర్య ఫస్ట్‌ లుక్..!

-

హీరో‌ నాగశౌర్య ప్ర‌స్తుతం ఇటు కమర్షియల్ చిత్రాలతో పాటు, కంటెంట్ ఉన్న చిత్రాల‌లో న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం నాగశౌర్య త‌న 20వ సినిమా చేస్తుండ‌గా, ఇటీవ‌ల ప్రీ లుక్ విడుద‌ల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక తాజాగా శేఖ‌ర్ క‌మ్ముల ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల చేశారు. ఇందులో కండ‌లు తిరిగిన దేహంతో విల్లు ఎక్కు పెట్టిన‌ట్టుగా క‌నిపిస్తున్నాడు. నాగ‌శౌర్య స్టన్నింగ్ లుక్ చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.

నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రూపొందుతున్న నాగ‌శౌర్య 20వ చిత్రం ప్రాచీన క్రీడా నేపథ్యంలో రూపొందుతోందని టాక్.  ఈ చిత్రానికి సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తుండగా.. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. అతిత్వరలో చిత్రానికి సంబంధించిన నటీనటుల పూర్తి వివరాలు అతి త్వరలో ప్రకటించనుంది చిత్రయూనిట్. కేతిక శ‌ర్మ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version