“పవర్‌ స్టార్”‌ సీక్వెల్స్‌ తీస్తూనే ఉంటా.. వసూళ్ళు చెబితే గుండె ఆగి చస్తారు : వర్మ

-

రామ్‌గోపాల్‌ వర్మ “పవర్‌ స్టార్”‌ సినిమా జూలై 25న ఆర్జీవీ వరల్డ్‌ థియేటర్స్‌ పతాకంపై ఆన్‌లైన్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పవర్‌ స్టార్‌ వసూళ్ళు అద్బుతంగా వస్తున్నాయని, ఆ వివరాలు చెబితే గుండె ఆగి చస్తారని చెప్పట్లేదని చెప్పారు వర్మ. టాలీవుడ్‌కి శివ సినిమా లాగా.. ఆన్ లైన్ థియేటర్‌కి ‘పవర్ స్టార్’ మూవీ అలా అని ట్వీట్‌ చేశాడు. ఇక పవర్‌ స్టార్‌ సినిమా చూడటానికి 150 రూపాయలు ధర నిర్ణయించిన వర్మ ఈ రోజు నుండి రూ. 250కి పెంచారు. ట్యాక్స్‌లతో కలిపితే రూ. 295 అవుతుంది.

పవర్‌ స్టార్‌ సినిమాను కంటిన్యూగా చేస్తానని, సీక్వెల్స్‌ వస్తూనే ఉంటాయని ఆర్జీవీ సంచలనం రేపాడు. పవర్‌ స్టార్‌ సినిమాలోని పాత్రలతో ఆ సినిమాలు వుంటాయని, వివరాలు త్వరలో వెల్లడిస్తానని తెలిపాడు. ఇక వర్మ తాను పవన్‌ కళ్యాణ్‌ మంచి కోరుకునే వ్యక్తినంటూ పవర్‌ స్టార్‌ సినిమాలో చూపించాడు. పవన్‌ కళ్యాణ్‌ పేరును వాడుకొని ఎంతో మంది హిట్‌లు కొట్టారు, అలానే ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. వర్మ మాత్రం వాడుకోవడంలో తన స్టైల్‌ వేరంటూ నిరూపించాడు. వాడకం అంటే అలా ఇలా కాదండి.. తన నుంచి రాబోయే సినిమాల ప్రమోషన్స్‌ను మద్యలో ఇరికిస్తూ వాటిని ప్రమోట్‌ చేస్తున్నాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. ఆన్‌లైన్‌లో డబ్బులు పెట్టి సినిమాలు చూస్తారని నిరూపించడానికి పవన్‌ కళ్యాణ్‌ ఇమేజ్‌ని వాడుకున్నాడు.


కాకపోతే తరువాత వర్మ నుంచి వచ్చే బూతు చిత్రాలకు ఇది మంచి బూస్టింగే. పబ్లిసిటీ స్టంట్స్ కోసం పవన్‌ని బాగా వాడుకున్నాడు ఆర్జీవీ.. పవర్‌ స్టార్‌ సీక్వెల్స్‌ ఉంటాయని ప్రకటించిన వర్మకు సీక్వెల్‌ దాడులుంటాయని తెలియనిది కాదు.. చూద్దాం ఏమవుతుందో..

Read more RELATED
Recommended to you

Exit mobile version